కడప కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కలెక్టరేట్ లోని డ్వామా కార్యాలయంలో పని చేస్తున్న 60 మంది ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 18 మందికి కరోనా సోకడంతో కలెక్టరేట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన బాధితులను హోం ఐసోలేషన్‌కు పంపించారు. మిగిలిన 42 మందిని ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement