Saturday, November 23, 2024

అమెరికాలో మరోసారి భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వ్యాక్సినేషన్ కరోనా కేసులను తగ్గించడం లేదని మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే అగ్ర రాజ్యం అమెరికాలో సగం మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. చాలా మంది రెండు డోసులూ తీసుకున్నారు. దీంతో అక్కడి అధికారులు మాస్క్ నిబంధనలనూ ఎత్తేశారు. భౌతిక దూరం కూడా పాటించాల్సిన అవసరం లేదని సూచించారు. కట్ చేస్తే… అమెరికాలో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.

బుధవారం ఒక్కరోజే దేశంలో 70,740 కేసులు నమోదయ్యాయి. 8.07 లక్షల కరోనా టెస్టులు చేశారు. మంగళవారంతో పోలిస్తే కేసులు 5.94% పెరిగాయి. ప్రపంచంలోనే రోజువారీ కేసుల్లో అమెరికా మళ్లీ మొదటి స్థానంలో ఉంది. ఇండోనేసియాలో 45,203, భారత్ లో 43,654, బ్రెజిల్‌లో 41,411 కేసులు నమోదైనట్టు అమెరికాలో రోజువారీ కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సటీ పేర్కొంది. అయితే వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటిదాకా 3,54,87,490 మంది కరోనా బారిన పడగా.. 6,28,098 మంది చనిపోయారు. కాగా, నిన్న 3,95,489 వ్యాక్సిన్ డోసులు వేశారు. మొత్తంగా 16.33 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.

ఈ వార్త కూడా చదవండి: కేరళలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్

Advertisement

తాజా వార్తలు

Advertisement