Tuesday, November 26, 2024

చైనాలో కరోనా విస్ఫోటనం.. ఒకేరోజు 3.70 కోట్లమందికి వైరస్‌

కరోనా కొత్త వేరియంట్‌ విస్ఫోటనంతో చైనా విలవిలలాడుతోంది. కోట్లమందికి వైరస్‌ సోకుతుండగా లక్షలాదిమంది కన్నుమూస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఒకే రోజు 3.7 కోట్లమందికి కొత్త వేరియంట్‌ నిర్ధారణయ్యింది. చైనాలో తాజా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కరోనా కేసుల సంఖ్యలోను, విస్తృతిలోనూ ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలోనే నమోదైనట్లు అక్కడి వర్గాలు ఉటంకించాయి. డిసెంబర్‌ మొదటి వారంలో, అంటే తొలి 20 రోజుల్లో దేశ జనాభాలోని 18 శాతంమంది, అంటే 24.8 కోట్లమంది కరోనా బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ బుధవారం గోప్యంగా నిర్వహించిన అంతర్గత సమావేశంలో తాజా పరిస్థితులపై సమీక్ష జరిపారు. అంతకుముందు 24 గంటల్లో 37 మిలియన్లమందికి కొత్త వైరస్‌ సోకినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు ధ్రువీకరించారు. ప్రపంచంలో ఒకేరోజు అత్యధిక కేసులు నమోదైన ఉదంతం ఇదే. గత జనవరి 19న ఒకేరోజు 40 లక్షలమందికి వైరస్‌ సోకడమే ఇంతవరకు రికార్డు.

ఆంక్షల ఎత్తివేత ఫలితమే…

వూహన్‌లో రెండేళ్ల క్రితం కరోనా తలెత్తినప్పటినుంచి జీరో కోవిడ్‌ విధానంతో కఠిన ఆంక్షలు, చర్యలు తీసుకున్న జిన్‌పింగ్‌ ప్రభుత్వం ప్రజలనుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం వెరవని చైనా అమానవీయ పద్ధతులను అనుసరించింది. చివరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలు రోడ్డెక్కి ప్రదర్శనలకు దిగడంతో జీరో కోవిడ్‌ విధానాన్ని సడలించి ఆంక్షలను ఎత్తివేసింది. దాంతో ఒక్కసారిగా చైనాలో మహమ్మారి అతివేగంగా విస్తరించడం మొదలైంది. కేవలం మూడువారాల్లో పరిస్థితి చేయిదాటిపోయింది. చైనీయులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంవల్లే వైరస్‌ వేగంగా సోకుంతోందని భావిస్తున్నారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లో ఏకంగా సగానికి సగం మంది వైరస్‌ బారినపడ్డారు. ఇక రాజధాని బీజింగ్‌లోనూ అత్యధికులు కరోనా బాధితులే. షెంజెన్‌, షాంఘా, చోంజికింగ్‌ పట్టణాల్లో పరిస్థితి భీతావహం. తాజా పరిస్థితులు, నియంత్రణపై చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ఏం చేయబోతోందన్నదానిపై స్పష్టత లేదు. దేశంలోని పీసీఆర్‌ పరీక్ష కేంద్రాలను మూసివేయడంతో ముప్పు ఎక్కువైంది. ఈ సంస్థ ఏర్పాటు చేసిన నేషనల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ బ్యూరో కూడా నోరు విప్పడం లేదు.

- Advertisement -

రాపిడ్‌ టెస్ట్‌లపైనే ఆధారం

ప్రభుత్వ పరీక్షా కేంద్రాలను మూిసివేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న్‌ాు. రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లపైనే వారు ఆధారపడుతున్నారు. కరోనా నిర్ధారణ అయితే, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. అటు ప్రభుత్వం కూడా రోజువారీ గణాంకాలను, ప్రత్యేకించి లక్షణాలు బయపడని రోగుల సంఖ్యను వెల్లడించడం లేదు. ప్రస్తుతం కొత్తవేరియంట్‌ వ్యాప్తి ఇదే జోరు కొనసాగుతుందని, జనవరి రెండోవారానికి మరింత ఉధృతమై తరువాత నెమ్మదిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

మరణాల సంఖ్య.. అవాస్తవాలు

కరోనా కొత్తవేవ్‌లో లక్షలమంది మరణిస్తున్నప్పటికీ, మృతుల సంఖ్యపై మౌనం పాటిస్తున్నారు. తాజా సమావేశంలోనూ ఆ అంశం ప్రస్తావనకు రాలేదు. కరోనాతో మరణించినప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలనే సాకుగా చూపి మరణాల సంఖ్యను తక్కువగాచూపిస్తున్నారు. కేవలం కరోనా సంబంధిత న్యుమేనియాతో మరణించినవారినే కోవిడ్‌ మృతులుగా పేర్కొనాలని ఎన్‌హెచ్‌సీ ఉన్నతాధికారి మా జియోమి ఆదేశించారు. అలా నిర్ధారించిన మృతుల సంఖ్యే లక్షల్లో ఉండగా మిగతా మృతుల సంఖ్య జోడిస్తే గుండె చెరువవుతుంది. మొత్త మదట తాజా వేరియంట్‌ కేసులు బీజింగ్‌లో మొదలైనట్లు సమావేశం అభిప్రాయపడింది. ఆ తరువాత పట్టణాలనుంచి పల్లెల్లోకి పాకింది. వైద్య సదుపాయాలు లేకపోవడంతో గ్రామీణ చైనాలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement