ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపింది. ఇప్పటికే 8 మంది ఖైదీలకు కరోనా వ్యాప్తి చెందగా.. తాజాగా మరో 13 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా సోకిన ఖైదీలకు ప్రత్యేక బ్యారెక్‌లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. జైలు సిబ్బందికి, ఇతర ఖైదీలకు కొవిడ్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు.
గతేడాది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు కరోనా బారిన పడ్డారు. మళ్లీ సెకండ్ వేవ్ భయం వెంటాడుతున్న సమయంలో కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మరోవైపు రాష్ట్రంలో రోజుకు రెండు వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి సూచించింది.