ప్రపంచవ్యాప్తంగా కరోనాకు చెక్ పెట్టేందుకు పోరు కనసాగుతోంది. అందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ కి అందకుండా కొన్ని వేరియంట్లు విజృంభిస్తున్నాయి. దీంతో కరోనాను పూర్తిగా అంతం చేయాలంటే మందు కనుక్కోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఊరటనిచ్చే వార్తను చెప్పారు. బ్రెజిల్ శాస్త్రవేత్తలు పాము విషంతో కరోనాకు మందు కనిపెట్టారు. దీనిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. బ్రెజిల్ సర్పమైన జరారా కుస్సు పాము విషంతో కరోనా మెడిసిన్ తయారు చేశారు. కోతులపై దీనిని ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని ట్రయల్స్ నిర్వహించిన అనంతరం అత్యవసర వినియోగానికి ధరఖాస్తు చేస్తామని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వేరియంట్లు పుట్టుకురావడంతో వాటికి తగినట్టుగా వ్యాక్సిన్లు రెడీగా లేకపోవడంతో మహమ్మారి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం ప్రపంచంలో సీ 1.2 వేరియంట్ ప్రభలంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ మిగతావాటికంటే బలంగా ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కరోనా నుంచి బయటపడాలి అంటే ప్రస్తుతానికి వ్యాక్సిన్ తీసుకోవడం, నిబందనలు పాటించడం ఒక్కటే మార్గం కావడంలో జాగ్రతగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ సారైనా అన్నాచెలెళ్లు కలుస్తారా?