న్యూజిలాండ్ కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో అక్కడ మామూలు పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఆరు నెలల నుంచి కరోనా గోల లేకుండా ప్రశాంతంగా గడిపింది న్యూజిలాండ్. అయితే తాజాగా అక్కడ ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆరు నెలల తర్వాత తొలి సారి ఓ కేసు నమోదవడంతో ఆ దేశ ప్రధాని అప్రమత్తమయింది. ఇప్పటికే కరోనాపై పోరాటం చేసి విజయం సాధించింది న్యూజిలాండ్.. ఆపద సమయంలో.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు కదిలారు ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. అయితే, 6 నెలల తర్వాత స్థానికంగా తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.. ఈ కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నారు అధికారులు.. ఇక, దీంతో అప్రమత్తమైన ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్… మూడు రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు.
మరోవైపు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు వందల్లో మాత్రమే పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. కేవలం 26 మంది మాత్రమే కరోనాబారినపడి మృతిచెందారు.. అయితే, కరోనాపై పూర్తిస్థాయిలో విజయం సాధించి ప్రపంచదేశాల అభినందనలు అందుకున్న న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ ఒక కేసు టెన్షన్ పెడుతోంది.. దీంతో.. ఏకంగా మూడు రోజులు లాక్‌డౌన్ విధించారు ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్.. డెల్టా వేరియంట్ పరిస్థితిని మొత్తం మార్చగలదని పేర్కొన్న ఆమె.. కరోనాపై పూర్తిగా విజయం సాధించకపోతే ఏం జరుగుతుందో మనం ప్రపంచమంతా గమనిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి:తాలిబన్లు చంపినా ఆలయం వదలను: హిందూ పూజారి