Sunday, November 10, 2024

WHO | మ‌ళ్లీ కోర‌లు చాస్తున్న క‌రోనా !

కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు 84 దేశాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ఆగస్టు రెండు వారాల్లో కేసుల సంఖ్య సాధారణం కంటే 20 శాతం పెరిగిందని తెలిపింది.

అంతేకాకుండా, పారిస్ ఒలింపిక్స్‌లో 40 మంది అథ్లెట్లు కరోనాకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించారు. జెనీవాలో డబ్ల్యూహెచ్‌ఓ డాక్టర్ వాన్ కెర్‌ఖోవ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కోవిడ్ పరీక్షలు చేస్తే 10 శాతం పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె అన్నారు. ఇక‌ అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్‌లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోద‌వుతున్నాయిని తెలిపింది. గత 18 నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ల లభ్యత కూడా గణనీయంగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఈసారి కోవిడ్-19ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని దేశాలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement