Tuesday, November 19, 2024

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామాకు క‌రోనా పాజిటివ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే.. చైనాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇటీవ‌ల క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే తాజాగా… అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన‌ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. తాను కరోనా బారిన పడినట్లు ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా గొంతు సమస్యతో బాధపడుతున్నానని, కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలిందని, మిచెల్ కు నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. తాను, తన సతీమణి మిచెల్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒమాబా వ్యాక్సినేషన్ పై స్పందించారు. ఇప్పటివరకూ ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement