కరోనా వైరస్ మరోసారి కోరలు చాచుతోంది. మొన్నటి దాకా తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3824 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. హెచ్3ఎన్2 ఇన్ ప్లుయంజా కేసులు వ్యాప్తి చెందడంతో భారత్‌లో గత కొద్ది రోజులుగా తాజా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్-19 రికవరీ రేటు ప్రస్తుతం 98.77 శాతంగా ఉండటం కొంత ఊరట ఇస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కేసుల పెరుగుదలతో తమిళనాడు వంటితోపాటు పలు రాష్ట్రాలు ఆస్పత్రుల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కొవిడ్-19 కట్టడికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లను వైద్యాధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కొవిడ్-19 న్యూ వేరియంట్లను పసిగట్టేందుకు అన్ని పాజిటివ్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement