Saturday, November 23, 2024

బంగారం, వెండి ధ‌ర‌లు పైపైకి..

మెల్లమెల్లగా బంగారం, వెండి ధరలు కొండెక్కుతున్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.46,900కి పెరిగింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.160 ఎగిసి రూ.51,160గా నమోదైంది. అలాగే వెండి రేట్లు కూడా హైదరాబాద్‌లో పెరిగాయి. కేజీ వెండి రేటు రూ.500 పెరిగి రూ.59 వేలుగా రికార్డయింది. ఇటు హైదరాబాద్‌లోనే కాదు.. అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు పెరిగి.. కొనే వారికి షాకిచ్చాయి. అక్కడ కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.47,050కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.51,320గా ఉంది. వెండి రేటు ఢిల్లీలో రూ.680 పెరగడంతో.. కేజీ రూ.53,900 పలుకుతోంది. విజయవాడలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.150 పెరిగి రూ.46,900గా పలుకుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.51,160గా ఉంది. విజయవాడలో వెండి రేట్లు కేజీ రూ.500 పెరిగి రూ.59 వేలుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement