హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నా వదలడం లేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 462 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 403 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4702కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 25, 518 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 259 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మంలో 15, కరీంనగర్‌లో 9, మంచిర్యాల 10, మేడ్చల్ మల్కాజిగిరిలో 40, రంగారెడ్డిలో 35, సంగారెడ్డిలో 15 కేసులు నమోదయ్యాయి.
బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..
తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాశీపేట గురుకుల బాలుర పాఠశాలలో కలకలం రేపింది. 16 మంది విద్యార్థులకు తాజాగా వైరస్ సోకింది. గురువారం ఒక విద్యార్థికి వైరస్ సోకడంతో మిగిలిన విద్యార్థుల కు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలోనే 16 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్‌కు తరలించి… చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మిగతా విద్యార్థులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.