ఇండియాలోని పది రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ని గుర్తించారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్ డాక్టర్ షే ఫ్లీషాన్.దేశంలోని పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ బీఏ.2.75 (BA.2.75) సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు చెప్పారు. జులై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, పశ్చిమ బెంగాల్లో 13, ఢిల్లీ, జమ్ము, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కోటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో రెండు కలిసి మొత్తం 69 కేసుల్లో కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు షీఫ్లాన్ తెలిపారు. ఇది రాబోయే ట్రెండ్‌ను సూచిస్తోందని, ఈ వేరియంట్ ఆందోనకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీఫ్లాన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఇండియా (పది రాష్ట్రాల నుంచి) అలాగే, ఏడు ఇతర దేశాల నుంచి 85 స్వీక్వెన్స్‌లు అప్లోడ్ చేసినట్టు చెప్పారు. అయితే, ఇండియా వెలుపల స్వీక్వెన్స్‌ల నుంచి ఎలాంటి ట్రాన్స్‌మిషన్‌ను ట్రాక్ చేయలేదని అన్నారు.
ఇండియాలోని పది రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్-ఆందోనకరంగా మారే అవకాశం
Advertisement
తాజా వార్తలు
Advertisement