Monday, November 18, 2024

ప్ర‌పంచాన్ని ఆర్ధికంగా దెబ్బ‌తీసిన క‌రోనా.. 2020లో 226 ట్రిలియన్‌ డాలర్ల అప్పు..

కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన ఏడాది 2020లో ప్రపంచ అప్పు ఏకంగా 226 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. కరోనా కారణంగా అంతర్జాతీయ ఆర్థికమాంద్యం తలెత్తడం ఇందుకు ప్రధాన కారణంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ప్రపంచ అప్పు 2020లో 28 శాతం మేర పెరిగింది. గ్లోబల్‌ జీడీపీలో అప్పు 256 శాతానికి పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఏడాదిలో అప్పు అత్యధికంగా పెరిగిన సంవత్సరం కూడా ఇదేనని ఐఎంఎఫ్‌ ఫిస్కల్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ విటర్‌ గాస్పర్‌ వెల్లడించారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కారణంగా అప్పులు ఎక్కువగా పెరిగాయి. ఆయా దేశాల జీడీపీలో అప్పులు 2007 దాదాపు 70 శాతంగా ఉండగా.. 2020లో అవి ఏకంగా 124 శాతానికి పెరిగాయని ఐఎంఎఫ్‌ డేటా పేర్కొంది.

కాగా ఇదేసమయంలో ప్రైవేటు అప్పులు మితంగా 164 శాతం నుంచి 178 శాతానికి పెరిగాయని వివరించింది. అధిక అప్పులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో సరైన ద్రవ్య, మోనిటరీ పాలసీలను రూపొందించడం చట్టసభ్యులకు సవాలుగా మారిందని రిపోర్ట్‌ విశ్లేషించింది. ప్రపంచ వడ్డీ రేట్లు అంచనా కంటే వేగంగా పెరిగితే ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సవాళ్లు మరింత తీవ్రమవుతాయని రిపోర్ట్‌ పేర్కొంది. వృద్ధి కూడా దెబ్బతింటుందని లెక్కగట్టింది. ఆర్థిక పరిస్థితులను కట్టడి చేయడంతో అప్పులులేని ప్రభుత్వాలు, కుటుంబాలు, సంస్తలపై కూడా ఒత్తిడి పెరిగిందని ఐఎంఎఫ్‌ రిపోర్ట్‌ విశ్లేషించింది. కరోనా, గ్లోబల్‌ ఫైనాన్సింగ్‌ డివైడ్‌ డిమాండ్‌ దృఢంగా ఉంది. అంతర్జాతీయ సహకారం, వృద్ధి చెందుతున్న దేశాలకు ఇది తోడ్పడుతుందని ఐఎంఎఫ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement