Thursday, November 21, 2024

కరోనా ఎఫెక్ట్ – మే 1నుంచి 15 వేల మందికే స్వామి వారి దర్శనం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే ఈ ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం పై కూడా పడింది. దీంతో టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 300 రూపాయల దర్శన టికెట్లను పదిహేను వేలు మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇప్పటికే సర్వ దర్శనం టోకెన్ లను టిటిడి నిలిపివేసింది. ప్రస్తుతం రోజుకు 30 వేల మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో మే 1వ తేదీ నుంచి 15 వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం అధికారులు కల్పించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో టీటీడీ లో కూడా పలువురు ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీనిని అడ్డుకట్టవేసేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగానే భక్తుల సంఖ్యను కుదించినట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement