Wednesday, November 20, 2024

కరోనా ఎఫెక్ట్​: షాంఘై దిగ్బంధం, గడపదాటొద్దని పౌరులకు హెచ్చరిక

చైనాలో అత్యధిక జనాభా కలిగిన షాంఘైనగరం కఠినమైన కొవిడ్‌-19 లాక్‌డౌన్లను ఎదుర్కొంటోంది. రోజువారి కేసుల సంఖ్య 4000 దాటడంతో ఆంక్షలు తీవ్రతరం చేశారు. పౌరులెవరూ గడపదాటి బయటకు రావొద్దని అధికారయంత్రాంగం హెచ్చరిక చేసింది. చివరకు పెంపుడు కుక్కలుకూడా బయట కనిపించొద్దని హుకుం జారీచేసింది. చెత్త వేయడానికి కూడా బయటకు రావొద్దని చెప్పింది. 2.6 కోట్ల మంది జనాభా కలిగిన షాంఘై చైనాకు ఆర్థికరాజధాని. నగరాన్ని రెండుగా విభజించి రెండు దశల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. హువాంగ్‌కు తూర్పున ఉన్న నివాసితులు గృహనిర్బంధం చేయబడ్డారు. లాక్‌డౌన్‌ జిల్లాలలో 82 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆంక్షల నేపథ్యంలో లుజియాజుయ్‌ జిల్లాలో 20 వేల మందికిపైగా బ్యాంకర్లు,వ్యాపారులు, ఇతర కార్మికులు ఆఫీసుల్లోనే ఉండిపోతున్నారని స్థానిక పరిపాలన అధికారులు తెలిపారు. లూజియాజుయ్‌లోని బ్రోకరేజీలు, అసెట్‌ మేనేజర్‌లు, ఫైనాన్షియల్‌ ఎక్చేంజ్‌లు సిబ్బందిని కార్యాలయాలకు పిలిపించి, రాత్రిపూట బసచేయడానికి స్లీపింగ్‌ బ్యాగ్‌లు, ప్రాథమిక సామగ్రిని ఇచ్చారు. హువాంగ్‌పు నదికి తూర్పున ఉన్న పుడాంగ్‌ లూజియాాజుయ్‌ ఆర్థిక నగరంలో 285 ఆఫీస్‌ టవర్లలో 20 వేల మంది వైట్‌కాలర్‌ కార్మికులు, సేవా సిబ్బంది ఉన్నారు. లాక్‌డౌన్‌ వేళల్లో వ్యాపార కార్యకలాపాలు స్తంభించకుండా ఉండేందుకు ఈ విధమైన ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని పలు సంస్థలు పేర్కొన్నాయి.

భారత్‌లో 1,259 కొత్త కేసులు..
భారతదేశంలో కరోనావైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. మ#హమ్మారి ప్రారంభ రోజుల నాటి స్థాయికి తగ్గింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. సోమవారం 5.7 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వ#హంచగా.. 1,259 మందికి పాజిటివ్‌గా తేలింది. గడచిన 24 గంటల వ్యవధిలో 35 మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 15,378కి తగ్గాయి. కొత్తగా 1,700 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దాంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తంగా 4.30 కోట్ల మందికి కరోనా సోకగా, 5.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement