Friday, November 22, 2024

Corona Effect : ఈనెల 31 వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో పాఠ‌శాల‌ల మూసివేత

దేశవ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు… కొంత వ‌ర‌కు తగ్గిన కరోనా కేసులు… ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 11887 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే నిన్న ఒక్క రోజే 9 మంది ఈ వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 42 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై మహానగరంలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల నేపథ్యంలో పాఠశాలల‌ను జనవరి 31వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 9వ తరగతి లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అలాగే పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స‌ర్కార్ స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement