Saturday, November 23, 2024

కరోనా ఎఫెక్ట్: భారత్‌లో భారీగా పెరిగిన పేదరికం

కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవడమేకాదు, ఎంతో మందిని నిరుపేదలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దాని దెబ్బకు కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కాగా కరోనా వల్ల గతేడాది భారత్‌లో పేదరికం రెండింతలు అయినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో 6 కోట్లుగా ఉన్న నిరుపేదలు (రోజుకు రూ. 150 కంటే తక్కువ సంపాదించేవారు) గతేడాది కరోనా కారణంగా 13.4 కోట్లకు పెరిగారని ‘పియో’ అధ్యయనం వెల్లడించింది. అలాగే, రోజువారీ ఆదాయం రూ. 750-1500 మధ్య ఉన్న మధ్య తరగతి జనాభా సంఖ్య 9.9 కోట్ల నుంచి 6.6 కోట్లకు పడిపోయింది

లాక్‌డౌన్ కారణంగా అత్యధిక శాతం మంది ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారని అధ్యయనం వెల్లడించింది. ఇక, భారత్ ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో దశ ప్రభావం కూడా ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని జపాన్‌లోని నోముర రీసెర్చ్ సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే నెలకల్లా వైరస్‌ను కట్టడి చేయకుంటే ఆర్థిక వ్యవస్థ మరింత కునారిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement