Tuesday, November 19, 2024

నష్టాల్లో హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో మెట్రో ను ఏర్పాటు చేశారు. మెట్రో ప్రారంభమైన మొదటిలో ఒక రోజులో రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. కాగా ఆ తరువాత కరోనా రావటంతో మూసివేశారు. మళ్ళీ ప్రారంభించినప్పటికీ ఆ స్థాయిలో ప్రయాణికులు రాలేదు. ఈ నేపథ్యంలోనే మెట్రో సర్వీసులను తగ్గిస్తూ వచ్చారు.

అయితే మళ్ళీ మెట్రో పుంజుకుంటున్న సమయంలో ఇప్పుడు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మెట్రో ఎక్కాలంటే ఆలోచిస్తున్నారు. ఇక ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ మెట్రో రైల్ ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. ఈ మార్గంలో ప్రయాణికులు పూర్తిగా లేకుండానే మెట్రోరైలు తిరుగుతున్నాయి. ఈ మేర కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement