Monday, November 18, 2024

కరోనా విపత్కర పరిస్థితులు… విదేశాల్లో నర్సింగ్‌ ఉద్యోగావకాశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలను కరోనా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో నర్సులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నర్సింగ్‌ విద్యను అభ్యసించిన పలువురు విదేశాల్లో కొలువలవైపు దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా, యుకె, జర్మనీ, ఇతర యూరోపియన్‌ దేశాల్లో నర్సులకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులైన నర్సులకు విదేశాల్లో ఉద్యోగావకాశాల సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వర్క్‌ షాప్‌ను నిర్వహించాలని నిర్ణయించింది.
విదేశాల్లో నర్సింగ్‌ ఉద్యోగావకాశాలపై ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నారు.

తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించనున్నారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరు కానున్నారు. వర్క్‌ షాప్‌ లో విదేశాల్లో ఆరోగ్య రంగంలో ఉత్తీర్ణులైన నర్సులకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. వర్క్‌షాప్‌లో ఆయా దేశాల వారీగా ఉన్న అవకాశాలు, భారీగా జీతాలు, నైపుణ్యం కలిగిన వారికి ఉండే అవకాశాలు, అర్హతలు, అర్హతల పరీక్షలు, నియామక ప్రక్రియలు తదితర విషయాలపై నర్సులకు ఉండే సందేహాలను తీర్చనున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి కలిగిన నర్సులకు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని వర్క్‌ షాప్‌ లో కల్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement