Friday, November 22, 2024

చైనాలో మళ్లీ కరోనా మరణం.. ఆరు నెలల తర్వాత మళ్లీ భయం భయం

కొవిడ్‌ మహమ్మారి పరిస్థితులు దాదపు అదుపులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసులు నామ మాత్రంగా ఉంటున్నాయి. మరణాల భయం తొలగింది. అయితే, మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. జీరో కొవిడ్‌ పాలసీలో భాగంగా కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతున్నా, కొవిడ్‌ భయాలు తొలగలేదని తెలుస్తోంది. ఆరు నెలల తర్వాత అక్కడ తొలి కొవిడ్‌ మరణం నమోదవడమే ఇందుకు నిదర్శనం.

ఇప్పటి వరకు చైనాలో కొవిడ్‌ వల్ల మరణించిన వారి సంఖ్య 5227కి చేరుకుంది. ఈ ఏడాది మే 26న షాంఘైలో ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. ఆ తర్వాత బీజింగ్‌కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు తాజాగా మరణించినట్లు అక్కడి ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. ఇప్పటి వరకు ఆ దేశంలో 92శాతం మంది తొలి టీకా డోసు తీసుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement