హైదరాబాద్, ఆంధ్రప్రభ :తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో నాలుగో వేవ్ విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. వారం, పది రోజులుగా కరోనాకేసులను గమనిస్తే నాలుగో వేవ్ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు ఏ రోజుకారోజు 100కుపైగా పెరగడం, అదే సమయంలో రోజు రోజుకూ కరోనా యాక్టివ్ కేసులు 200ను మించి పెరుగుతుండడంతో ప్రజలంతా మరోసారి కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది.
లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయాల్సిందే..
దగ్గు, జలుబు తదితర ఇన్ ఫ్లూయెంజా లక్షణాలతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉన్న వారి నుంచి శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ విధానంలో నిర్ధారించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులకు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో వస్తే వెంటనే కొవిడ్ టెస్టు చేయాలని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి విధిగా శాంపిళ్లను సేకరించి జీనోమ్ టెస్టుకు పంపాలన్నారు. పాజిటివ్‌గా తేలితే వెంటనే క్వారంటైన్ చేయాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.