భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో పెరడగంపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉంది. మొత్తం 741 జిల్లాలకుగానూ 301 జిల్లాల్లో 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదువుతోంది. వాటిలో 15 జిల్లాల్లో అయితే ఏకంగా 50 శాతానికిపైగానే పాజిటివిటీ రేటు ఉండటం భారత్ లో వైరస్ ఉధృతికి అద్దం
50 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదవుతున్న15 జిల్లాలు అధికంగా హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ లలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్ జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉంది. అలాగే, దిబాన్ వ్యాలీతోపాటు పుదుచ్చేరిలోని యానాం, రాజస్థాన్‌లోని బికనీర్, పాలీ జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అలాగే, కేరళలోని 13, హర్యానాలో 19, బెంగాల్‌లో 19, ఢిల్లీలో 9, కర్నాటకలో 24 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికిపైగా నమోదైంది.