భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గురువారం నాడు 9,419 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే కేసులసంఖ్యలో 11.6 శాతం పెరుగుదల ఉందని. కొత్త కేసులతో కలపి ప్రస్తుతం దేశంలో 94,742 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహమ్మారి సోకినవారిలో 159మంది గురువారం ప్రాణాలు కోల్పోయారు. కాగా వ్యాక్సిన్ సమస్య ఉన్న దేశాల్లో రెండు వేరేరు వ్యాక్సిన్లను కలిపి ఇవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దేశీయంగా ఇప్పటివరకు 129.54 కోట్ల డోసుల వ్యాక్సిన్ను ప్రజలకు ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital