Friday, November 22, 2024

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..!

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ పలు చోట్ల కేసుల సంఖ్య పెరగడం కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నగరంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పో రేషన్‌ .. కొవిడ్‌ పరీక్షలను భారీ స్థాయిలో యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. టెస్టింగ్‌ ల్యాబ్‌లను అప్రమత్తం చేయడంతో పాటు పూర్థిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ముంబయి నగరంలో నిన్న ఒక్కరోజే 506 మందికి కొవిడ్‌ సోకింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదులు కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా క్రితం నెలతో పోలిస్తే మే నెలలో కేసుల సంఖ్య 100 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబయిలో రోజువారీ కొవిడ్‌ కేసులు గణనీ యంగా పెరిగాయి. ఓ వైపు రుతుపవనాలు సమీపిస్తున్నందున..

లక్షణాలున్న కేసుల్లో పెరుగుదల వేగంగా కనిపిస్తోంది అని బీఎంసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలను విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు బూ స్టర్‌ డోస్‌ పంపిణీని యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని సూచిం చింది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చనే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆస్పత్రులకు సూచించింది. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా కరోనా క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిన్న ఒక్క రోజే 2745 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 18 వేలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.6 శాతంగా ఉన్నప్పటికీ ముంబయిలో మాత్రం ఆరు శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement