దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశవ్యాప్తంంగా 59,118 కొత్త కేసులు నావుడు అయ్యాయి. మరోవైపు చికిత్స పొందుతూ 257 మంది మృతి చెందారు. కాగా గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మరి బారి నుంచి 32,987 మంది కోలుకున్నారు.
తాజాగా నమోదు అయిన కేసులతో కలిపి మొత్తం సంఖ్య 1,18,46,652కు చేరింది. ఇందులో 1,12,64,637 మంది కోలుకున్నారు. 4 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,60,949 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తగ్గినట్లే తగ్గి కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక్కరోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 1683కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3995 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 204 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,309కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,631 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.4శాతం ఉండగా తెలంగాణలో 0.55శాతంగా ఉంది. దేశంలో రికవరీ రేటు 95.1గా ఉంటే తెలంగాణలో 98.14శాతంగా ఉంది.
మరోవైపు హైదరాబాద్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది.కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో గురువారం 396 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 44కి పాజిటివ్‌గా నిర్థారణ అయింది.