Tuesday, November 26, 2024

దేశంలో కరోనా విలయతాండవం – కొత్తగా 2812 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి గణనీయంగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 3,52,991 కేసులు వచ్చాయి. అలాగే మరోవైపు ఒక్కరోజులో మహమ్మారి
బారిన పడి 2812 మృతి చెందారు. తాజా గణాంకాల ప్రకారం ఇండియా లో 1,73,13,163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మహమ్మారి కారణంగా 1,95,123 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 28,13,658 యాక్టీవ్ ఉన్నాయి. మరోవైపు దేశంలో 14కోట్ల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకుని1,43,04,382 డిశ్చార్ అయ్యారు.

దేశంలో మొత్తం కేసులు: 1,73,13,163
కోలుకున్న‌వారు: 1,43,04,382
మ‌ర‌ణించిన వారు: 1,95,123
యాక్టివ్ కేసులు: 28,13,658
ఇప్ప‌టివ‌ర‌కు వేసిన వ్యాక్సిన్లు: 14,19,11,223

Advertisement

తాజా వార్తలు

Advertisement