కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయింది. గత కొన్ని రోజులుగా నలభైవేలకు పైగా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటలలో ఏకంగా 53,476 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు చికిత్స పొందుతూ 251 మంది మృతి చెందారు.
తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కేసుల సంఖ్య 1,17,87,534 చేరింది. కాగా 26,490 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు 1,12,31,650 మంది డిశ్చార్జ్ కాగా 1,60,692 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 3,95,192 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా గతరాత్రి గడిచిన 24 గంటల్లో కొత్తగా 493 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,791కు చేరింది. ఇక కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,680కు చేరింది. మరోవైపు కరోనా నుంచి 157 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 3,684 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 82 వేలు దాటిన కరోనా కేసులు దాటాయి. గడిచిన 24 గంటల్లో మరో 138 కరోనా కేసులు గ్రేటర్ పరిధిలో నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 82,039 కరోనా కేసులు నమోదయ్యాయి.