టోక్యో లో కరోనా విజృంభిస్తోంది. ఈనెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. కాగా, రోజు రోజుకు నగరంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక రాజధాని టోక్యోలో కేసులు క్రమంగా పెరిగే అవకాశం ఉందని క్రీడలు ప్రారంభానికి ముందే నిపుణులు హెచ్చరించారు. ప్రపంచంలోని దాదాపు 200 దేశాల నుంచి వేలాదిమంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ట్యోక్యో చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు రోజులుగా క్రీడలు జరుగుతున్నాయి. క్రీడలు ప్రారంభానికి ముందే ఆ దేశంలో కరోనా కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. తాజాగా 3,885 కరోనా కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్పమత్తం అయ్యారు. క్రీడలు ప్రారంభమైన ఈ వారం రోజుల వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రేక్షకులు లేకుండానే క్రీడలను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. క్రీడలు ముగిసిన తరువాత భారీస్థాయిలో కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించడం మినహా మరో ఆప్షన్ లేదని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి :యాక్టివ్ గా ఉండెందుకు చెంప దెబ్బ కొట్టించుకున్న జూడో స్టార్..