భారత్ లో కరోనా పరిస్థితి అదుపు తప్పుతోందని ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో ప్రతి రోజు మూడున్నర లక్షల వరకు కేసులు నమోదవుతున్న తరుణంలో… అమెరికా ఆందోళన చెందుతోంది. ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలైనంత త్వరగా అమెరికాకు చేరుకోవాలని చెప్పింది.
లెవెల్-4 ట్రావెల్ అడ్వైజరీ కింద ఇండియాలో ఉన్న తమ పౌరులకు అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియాకు ఎవరూ వెళ్లవద్దని, అక్కడున్న వారు త్వరగా తిరిగి రావాలని చెప్పింది. భారత్ నుంచి వచ్చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని తెలిపింది. ఇండియా నుంచి అమెరికాకు ప్రతిరోజు 14 డైరెక్ట్ విమానాలు ఉన్నాయని… యూరప్ గుండా మరిన్ని విమాన సర్వీసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటికే ఇండియా నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి. భారత్ నుంచి తిరిగి వస్తున్న తమ పౌరులను ఇంగ్లండ్ ఒక హటల్ లో క్వారంటైన్ చేస్తోంది.