హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. స్తబ్దుగా ఉన్న కేసులు ఒక్కసారిగా 500 మార్కును దాటాయి. చాపకింద నీరులా కరోనా రాష్ట్రమంతటా విస్తరిస్తున్నది. టెస్టుల సంఖ్య నామమాత్రంగా ఉండడంతో పెద్దగా అధికారిక కేసుల సంఖ్య నమోదు కావడం లేదు. అయినప్పటికీ గురువారం 27,488 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 592 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. కోవిడ్ బారినుండి 477 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 4,997 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. రికవరీ రేటు 98.87 శాతంగా ఉందని పేర్కొన్నారు. తాజాగా వచ్చిన కోవిడ్ కేసులలో హైదరాబాద్లో 331, రంగారెడ్డి జిల్లాలో 60, ఖమ్మం 17, మేడ్చల్ 45, హన్మకొండ 10, భువనగిరి 9, కరీంనగర్ 9, నల్గొండ జిల్లాలో 11 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.