కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే తెలంగాణలో స్కూళ్లను మళ్లీ మూసివేస్తే మంచిదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తుంది. ఈ విషయమై కేసీఆర్ నిర్ణయం తీసుకొని ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తికి ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు కారణమవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.
మొదట విద్యార్థులకు సోకిన కరోనా ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా సోకుతుందని కరోనా మహమ్మారి వ్యాప్తి చెందేందుకు విద్యార్థులే ఒక విధంగా కారణం అవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కరోనా ని కట్టడి చేయాలి అంటే వెంటనే స్కూల్స్ ను మూసివేయాలని వైద్యఆరోగ్య శాఖ భావిస్తోంది.