Tuesday, November 26, 2024

చైనాలో మళ్లీ కరోనా బెల్స్‌.. రెండేళ్ల గరిష్ఠానికి రోజువారీ కరోనా కేసులు, డెల్టా, ఒమిక్రాన్‌ విజృంభణ

కొవిడ్‌- జీరో లక్ష్యంతో అత్యంత కఠిన ఆంక్షలు అమలుచేసిన చైనాపై కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ప్రపంచమంతా మహమ్మారి నుంచి బయటపడుతున్న వేళ బీజింగ్‌ను వైరస్‌ భయపెడుతోంది. ఇప్పుడు భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అక్కడ రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారంతో పోలిస్తే అదివారం కేసులు రెండింతలు అయ్యాయి. ఆదివారం కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు చైనా అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల్లో ఇది రెండేళ్ల గరిష్ఠం కావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కీలక నగరం షాంఘైలో పాఠశాలలను మూసివేసింది. మరికొన్ని నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు సమాచారం. జిలిన్‌ నగరంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు.

ఉత్తర కొరియా సరిహద్దు నగరమైన యాంజిని పూర్తిగా దిగ్బంధంలో ఉంచారు. ఏడు లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో ఇప్పటికే ఆరు రౌండ్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఓ స్థానిక అధికారి తెలిపారు. మరోవైపు మధ్యలో హమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆరోగ్య వ్యవస్థలు కాస్త నిర్లక్ష్యంగా మారినట్లు అంగీకరించారు. దేశవ్యాప్తంగా 1.7 కోట్లమందిని ప్రభుత్వం లాక్‌డౌన్‌లో ఉంచింది. దక్షిణ టెక్‌హబ్‌ నగరమైన షెన్‌జెన్‌లో పౌరులెవరూ ఇళ్లుదాటొద్దని ఆదేశాలు జారీచేశారు. ప్రజా రవణాను వారంపాటు నిషేధించారు. షెన్‌జెన్‌లో తాజాగా 66 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. షాంఘైలో పాఠశాలలను మూసివేశారు. ఉత్తరకొరియా సరిహద్దులోని ఏడు లక్షల జనాభా కలిగిన యాన్జీ పట్టణంతోపాటు, చాంగ్‌చున్‌ పారిశ్రామిక నగరం కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎదుర్కొంటున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement