హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు 600 మార్కును దాటాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 608 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 459మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5146కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 28, 055 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 329 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… భద్రాది, ఖమ్మం జిల్లాల్లో 15, కరీంనగర్ 10, మంచిర్యాల 5, మేడ్చల్ మల్కాజిగిరిలో 54, రంగారెడ్డిలో 67, సంగారెడ్డిలో 16 అత్యధిక కేసులు నమోదయ్యాయి.
గడిచిన 15 రోజులుగా దేశంతోపాటు రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లిd పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2శాతాన్ని దాటింది. కేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల పాలవుతున్న జనం సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. అయితే 10ఏళ్ల లోపు చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 60ఏళ్లు పైబడిన వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.