కామారెడ్డి, ప్రభన్యూస్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైలు పట్టాల పక్కన గల ఆర్ బి నగర్ లో మంగళవారంనాడు పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటిని గాలించి బైకులను ఆటోలను ఇతర వాహనాలను పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి డిఎస్పి సోమనాథం ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆర్ సి లు అనుమతి పత్రాలు లేని 121 బైకులు, 28 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై వెళ్లి ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కామారెడ్డి డిఎస్పి సూచించారు.
వాహనానికి సంబంధించిన ఆర్సి పత్రాలు ఇతర సంబంధిత ఓనర్ షిప్ పత్రాలు తప్పకుండా వెంట ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు అతి వేగంగా వెళ్లొద్దని వేగంగా వెల్టే ప్రమాదం అవుతుందని కామారెడ్డి డి.ఎస్.పి జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ సీఐ, రూరల్ సీఐ , పరిసర మండలాల ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..