న్యూఢిల్లి : కరోనాను నివారించే మరో వ్యాక్సిన్ కోర్బెవాక్స్‌ను బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపారు. కార్బొవాక్స్ టీకాలను హైదరాబాద్ కేంద్రంగా బయలాజికల్ ఈ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.. పైగా తొలి రెండు డోస్‌లూ వివిధ వ్యాక్సిన్లు వేసుకున్నప్పటికీ బూస్టర్ డోస్‌గా కోర్బెవాక్స్‌ను వాడుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. అయితే ఇది పెద్దలకు మాత్రమే పరిమితం. రెండో డోస్ వేసుకున్న ఆరునెలల అనంతరం ఈ బ ూస్టర్ డోస్ తీసుకోవచ్చు. తాజా అనుమతులపై బయలాజికల్ ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ మహిమా దాట్ల ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సంస్థ ప్రారంభించిన వ్యాక్సినేషన్ యజ్ఞంలో మరో మైలురాయి దాటామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
కోర్బెవాక్స్ టీకాలను బూస్టర్ డోస్ ఇచ్చేందుకు చేసిన ప్రయోగ ఫలితాలను ఇటీవలే డీసీజీఐకు బయలాజికల్ ఈ సంస్థ నివేదించింది. 18, 80 ఏళ్ల మధ్య వయస్సున్న 416మందిపై ఆ సంస్థ ప్రయోగాలు నిర్వహించింది. వారిలో రోగనిరోధక శక్తి పెరగడాన్ని గుర్తించింది. వాటిని పరిశీలించిన నిపుణుల కమిటీ బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. తొలి రెండు డోస్‌లుగా కోవాక్సిన్, కోవిషీల్డ్ వేసుకున్నప్పటికీ దీనిని మూడో డోస్‌గా వేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకు భారత్‌లో ఇప్పటివరకు 51.7 మిలియన్ల మందికి కోర్బెవాక్స్ టీకాలు వేశారు. వీరిలో 17.4 మిలియన్లమందికి రెండుడోస్‌లు పూర్తయ్యాయి. కేంద్రప్రభుత్వానికి దాదాపు 10 కోట్ల డోస్‌ల కోర్బెవాక్స్ టీకాలను బయలాజికల్ ఈ సంస్థ సరఫరా చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.