Tuesday, November 26, 2024

Delhi | లోక్‌సభ స్థానాలకు కోఆర్డినేటర్లు.. ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లోక్‌సభ నియోజకవర్గాలవారిగా కోఆర్డినేటర్లను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల నుంచి మొదలుపెట్టి ఎన్నికల వ్యూహాలను అమలు చేసే విషయంలో కోఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసిన ఏఐసీసీ నాయకత్వం, తాజాగా లోక్‌సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను ప్రకటించడం ద్వారా ఎన్నికల సంసిద్ధతను చాటుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు కోఆర్డినేటర్లను ప్రకటించగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గంలోని నేతలకు, పార్టీ సీనియర్ నేతలకు బాధ్యతల్ని అప్పగించింది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలకు రెండేసి నియోజకవర్గాల బాధ్యతల్ని అప్పగించింది.

తెలంగాణ కోఆర్డినేటర్ల జాబితా:

1 ఆదిలాబాద్ (ST) – డి. అనసూయ (సీతక్క)
2 పెద్దపల్లి (SC)  – డి. శ్రీధర్ బాబు
3 కరీంనగర్ – -పొన్నం ప్రభాకర్
4 నిజామాబాద్ – టి.జీవన్ రెడ్డి
5 జహీరాబాద్ – పి.సుదర్శన్ రెడ్డి
6 మెదక్ – దామోదర రాజనరసింహ
7 మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు
8 సికింద్రాబాద్ – భట్టి విక్రమార్క మల్లు
9 హైదరాబాద్ – భట్టి విక్రమార్క మల్లు
10 చేవెళ్ల – ఎ. రేవంత్ రెడ్డి
11 మహబూబ్ నగర్ – ఎ. రేవంత్ రెడ్డి
12 నాగర్ కర్నూల్ (SC) – జూపల్లి కృష్ణారావు
13 నల్గొండ – ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
14 భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
15 వరంగల్ (SC) – కొండా సురేఖ
16 మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
17 ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ల జాబితా:

1 అరకు – (ఎస్టీ) జగతా శ్రీనివాస్
2 శ్రీకాకుళం – మీసాల సుబ్బన్న
3 విజయనగరం – బొడ్డేపల్లి సత్యవతి
4 విశాఖపట్నం – కొత్తూరి శ్రీనివాస్
5 అనకాపల్లి – సనపాల అన్నాజీరావు
6 కాకినాడ – కే.బీ.ఆర్. నాయుడు
7 అమలాపురం – (ఎస్సీ) ఎం. వెంకట శివ ప్రసాద్
8 రాజమండ్రి – ముషిని రామకృష్ణ
9 నరసాపురం – జెట్టి గురునాధరావు
10 ఏలూరు – కనుమూరి బాపి రాజు
11 మచిలీపట్నం – కొరివి వినయ్ కుమార్
12 విజయవాడ – డి.మురళీ మోహన్ రావు
13 గుంటూరు – గంగిశెట్టి ఉమాశంకర్
14 నరసరావుపేట – వి.గురునాధం
15 బాపట్ల – (ఎస్సీ) శ్రీపతి ప్రకాశం
16 ఒంగోలు – యు.వెంకటరావు యాదవ్
17 నంద్యాల – బండి జకారియా
18 కర్నూలు – పి.ఎం. కమలమ్మ
19 అనంతపురం – ఎన్ శ్రీహరి ప్రసాద్
20 హిందూపూర్ – షేక్ సత్తార్
21 కడప – ఎం. సుధాకర్ బాబు
22 నెల్లూరు – ఎం.రాజేశ్వరరావు
23 తిరుపతి (ఎస్సీ) – షేక్ నాజర్ అహమ్మద్
24 రాజంపేట – డా. ఎన్. తులసి రెడ్డి
25 చిత్తూరు – (ఎస్సీ) డి. రాంభూపాల్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement