Tuesday, September 17, 2024

TG | హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా.. వినాయక చవితికి ఏర్పాట్లు

కొన్ని రోజుల్లో వినాయక చవితి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుండే సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం గ‌ణ‌ప‌తి ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై చర్చించారు. జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హెచ్ఎండీఏ నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై మంత్రి ఆరా తీశారు.

ఇక‌ రాబోయే వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈరోజు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందని అన్నారు. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అలా జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. విగ్రహాల తయారీ ప్రాంతం నుండి జిల్లాలకు పోయే విగ్రహాల వరకు నగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే విగ్రహాలకు వరకు రూట్ లలో రోడ్లు, విద్యుత్ ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించిన‌ట్లు తెలిపారు. ఇక హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం అనేది కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌ సిటీ పోలీసులు నిరంతరం సీసీ కెమెరాలతో నిఘాని ఏర్పాటు చేసి 24 గంటల పాటు వారి పరిధిలో జంటనగరాలు ఉండనున్నాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement