కేరళ సీఎం పినరయివిజయన్ కాన్వాయ్కి ఆక్సిడెంట్ జరిగింది. తిరువనంతపురంలోని వామనపురంలో సీఎం కాన్వాయ్ కి ఓ స్కూటర్ అడ్డు వచ్చింది. ఒక్కసారిగా బండి అడ్డు రావడంతో ఎస్కార్ట్ లోని మొదటి బండి సడెన్ బ్రేక్ వేసింది.
దాంతో వేణుక వస్తున్న ఎస్కార్ట్ బండ్లు అన్ని ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఐదు ఎస్కార్ట్ వాహనాలు ధ్వంసం కాగా.. సీఎం పినరయివిజయన్కు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.