పశ్చిమ బెంగాల్‌లో రెండు సింహాలకు పెట్టిన పేర్లు వివాదానికి దారి తీసాయి. త్రిపుర నుంచి తీసుకొచ్చి సిలిగురిలోని బెంగాల్ సఫారీ పార్క్‌లో ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన రెండు సింహాలకు అక్చర్, సీత అని పేర్లు పెట్టారు. అయితే తాము పూజించే సీతాదేవి పేరును సింహానికి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వహిందూ పరిషత్.. కలకత్తా హైకోర్టు హైకోర్టును ఆశ్రయించింది. ఆడ సింహానికి పెట్టిన పేరును మార్చాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.
ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ సౌగత భట్టాచార్యతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాలకు దూరంగా ఉండాలని, రెండు సింహాలకు పెట్టిన పేర్లు మార్చే అంశాన్ని పరిశీలించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.