Monday, November 18, 2024

సరిహద్దులలో పాస్ ల లొల్లి !!

కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లో అనుమతి లేకుండా వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. లాక్ డౌన్ సడలింపు వేళల్లోనూ ఈ-పాసను తప్పనిసరి చేశారు. అంబులెన్స్ లను, అత్యవసర వాహనాలకు మాత్రం ఈ-పాస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ-పాస్ ఉన్న వారినే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద, జోగులాంబగద్వాల జిల్లాపుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఏపీకి చెందిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం వరకు..అంతర్రాష్ట్ర రవాణాకు పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సాఫీగా సాగిపోయాయి.లాక్ డౌన్ సడలింపు ఉందనివాహనదారులు భారీగాతరలిరావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ఈ-పాస్ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్లు లేని వాహనదారులను నిలిపేస్తున్నారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతు న్నాయి. ఆదివారం సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణలో ఉదయం పది గంటల వరకు లాక్ డౌన్ మినహాయింపు ఉంది. లాక్ డౌన్ మినహా యింపు సమయానికే బోర్డర్‌కు చేరుకున్నా కేవలం ఈ-పాస్ ఉన్న వాహనాలు, అంబులెన్లకే అనుమతిస్తామని చెప్పడంతో బోర్డర్‌లోవాహనదారులకు, పోలీసులకు మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ కఠినంగా అమలుచేస్తుండడంతో అనుమతి లేకుండా ఎవరూ రాష్ట్రంలోకి రావొద్దని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement