Monday, November 18, 2024

Controversy Comments నటి క‌స్తూరి క్షమాపణ చెప్పాల్సిందే….

తెలుగు వారిపై క‌స్తూరి వివాదస్ప‌ద వ్యాఖ్యలు
మండి ప‌డుతున్న తెలుగు నేత‌లు
క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్

సీనియర్ తమిళ నటి, బీజేపీ నేత కస్తూరి తెలుగు జాతిపై నోరుపారేసుకున్నారు. తమిళనాడు బ్రాహ్మణులకు మద్దతు తెలుపుతూ ద్రావిడ సిద్ధాంతాలను విమర్శించే క్రమంలో ఆమె తెలుగు జాతిని అవ‌మానించే విధంగా కామెంట్స్ చేశారు. కస్తూరి మాట్లాడుతూ ‘ రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు.

దీంతో ఈ వ్యాఖ్యలు చిచ్చురేపుతున్నాయి. అలాగే “ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని” కస్తూరి ఆరోపించారు. కాగా ఈ వ్యాఖ్యాల‌పై ప‌లువురు తెలుగు నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.. క‌స్తూరి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయితే క‌స్తూరి త‌న వ్యాఖ్యాల‌పై వివ‌ర‌ణ ఇస్తూ , తాను అలా మాట్లాడ‌లేద‌ని, డిఎంకె నే తాను అన్న‌ట్లు ప్ర‌చారం చేస్తుంద‌ని అన్నారు.. త‌న‌కు ఎపి, తెలంగాణ ప్రాంతాలు మెట్టింట‌వ‌ని అటువంట‌ప్పులు తాను అలా ఎలా వ్యాఖ్యాల చేస్తాన‌ని అంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement