Thursday, November 21, 2024

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించండి.. : లావు శ్రీృష్ణ దేవరాయలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పల్నాడు వాసుల దశాబ్దాల కల అయిన అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని, అందుకు కావలసిన అనుమతులివ్వాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అటవీశాఖ ఏడీజీ బివాష్ రంజన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు పొందడానికి అవసరమైన డీపీఆర్ సహా అన్ని ప్రక్రియలను పూర్తి చేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన్నట్లు చెప్పారు.

- Advertisement -

ఈ ప్రాజెక్టులో ముఖ్య భాగాలైన పంప్ హౌజ్, ప్రెజర్ మెయిన్, బ్రేక్ ప్రెజర్ ట్యాంక్, ఇతర నిర్మాణాలు చేపట్టడానికి కావాల్సిన భూమి అటవీ ప్రాంతంలో ఉందని, అది రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యమని, నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ప్రధాన ప్రాంతమని వివరించారు. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని కోరారురు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గంగులకుంట గ్రామం సమీపంలో నాగార్జునసాగర్ జలాశయం వరికపూడిసెల తీరం మీద ఈ ప్రాజెక్టు నిర్మించాల్సి ఉందని, ఈ ప్రాజెక్టు పూర్తైతే భారీ ఎత్తున సాగు, తాగు నీటి సమస్య తీరుతుందని ఎంపీ శ్రీకృష్ణ బివాష్ రంజన్ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement