Tuesday, November 26, 2024

పండుగ‌కి జీతాలొచ్చేనా!?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నెలల తరబడి వేతనాలు అందక కుటుంబపోషణ భారమై అప్పుల పాలవు తున్నారు. ఇంటి అద్దెలు, ఈఎంఐలు, చేసిన అప్పు లకు వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతున్నారు. పండగలకు జీతాలు అందక పస్తులు ఉండే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విధులు నిర్వ ర్తిస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాప కులు ప్రభుత్వ ఉద్యో గులతో సమానంగా పనిచేస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించడంలేదని ఆవేదన చెందుతున్నారు. వేతనాల కోసం ఆందోళనలు చేపట్టా లని ఉన్నా ఎక్కడ తమ ఉద్యోగాలు ఊడుతాయనే భయంతో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు వెనుకడుగు వేస్తున్నారు.

గత అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ వేతనాలు ఇప్పటి వరకు కూడా అందకపోవడంతో గత దసరా, దీపావళి, బక్రీద్‌, క్రిస్మస్‌, న్యూఇయర్‌ పండుగలను కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా జరుపు కోలేదని ఆవేదన చెందుతున్నారు. కనీసం ఒకట్రెండు రోజుల్లోనైనా తమకు వేతనాలను ప్రభుత్వం విడుదల చేస్తే ఈ సంక్రాంతి పండుగైనా సంతోషంగా జరుపుకుంటామని వాపోతున్నారు. లేకుంటే తమకు పండగపూట ఆకలికేకలే మిగులుతాయని ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకైనా వేతనాలను విడుదల చేస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని బాధిత అధ్యాపకులు పేర్కొంటున్నారు.
జూనియర్‌ కాలేజీల్లో దాదాపు 3,500 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో కలిపి మరో 1500 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి గత అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెల జీతాలు అందాల్సి ఉంది. వీరందరికీ కలిపి మొత్తం సుమారు రూ.5 కోట్ల వరకు వేతనం పెండింగ్‌లో ఉంది. అయితే మూడు నెలల వేతనాలకు సంబంధించి ఆయా హెచ్‌ఓడీలు ప్రొసీడింగ్స్‌ ఇప్ప టికే విడుదల చేశారు. సంబంధిత డ్రాయింగ్‌ అధి కారులు వేతనాలకు సంబంధించిన బిల్లులు కూడా సిద్ధం చేసి ఆయా జిల్లా కోశాధికారులకు పంపించారు. అక్కడ ఆమోదించి టోకెన్‌ నెంబర్లను సైతం ఇచ్చి వీటిని ఈకుబేర్‌లో ఇప్పటికే పంపించారు. కానీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వీటిని విడు దల చేస్తే తప్ప కాంట్రాక్ట్‌ అధ్యాప కులకు వేత నాలు వచ్చే అవకాశం లేదని అధ్యాపక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సకా లంలో వేతనాలు అందక పోవడంతో పండగలు, శుభకా ర్యాల ప్పుడు అప్పులు చేసి కుటుం బాలను నెట్టు కొస్తు న్నామని వాపోతున్నారు. ఇంటి అద్దె, ఇతర బకాయిల గురించి అప్పుల వాళ్లు ప్రతీ రోజు తమ ఇంటికొచ్చి అడుగు తున్నారని, వారికి సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక మంత్రి దృష్టికి గతంలోనే తీసుకెళ్లడంతో ఇకనుంచి ప్రతినెల తప్పనిసరిగా వేతనాలు చెల్లిస్తామని హాహీ ఇచ్చినా అధికారుల అలసత్వంతో అది అమలుకు నోచుకోవడంలేదు.

వేతనాలు ఇవ్వకుంటే పండక్కి పస్తులే
సకాలంలో వేతనాలు అందక తాము తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాము. కుటుంబ సభ్యులతో పండుగలు జరుపుకోని పరిస్థితి ఉంది. ఈ సంక్రాం తికైనా గత మూడు నెలల పెండింగ్‌ వేతనాలను విడు దల చేయాలి. తమ వేతనాల గురించి అనేకసార్లు ఆర్థిక శాఖ అధికా రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుం డా పోతుంది. వెంటనే సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావు ఈ విష యంలో జోక్యం చేసు కొని పెం డింగ్‌ వేతనాలను విడుదల చేయాలని కోరుతున్నాం.
కె.సురేష్‌, తెలంగాణ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం , ప్రధాన కార్యదర్శి

Advertisement

తాజా వార్తలు

Advertisement