టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజాగా నటిస్తున్న మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో సమంత కు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు.
ఈ సినిమాలో సామ్ ను శకుంతలగా చూపించేందుకు ,. ప్రతీ ఫ్రేమ్ లోనూ గొప్పగా చూపించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు . పౌరాణిక ప్రేమగాథలో ఒరిజినాలిటీ ఉండేందుకు ఒరిజినల్ నగలనే వాడారట చిత్రబృందం. మొత్తం 3 కోట్ల రూపాయల విలువ చేసే నగలను సామ్ మెడలో వేసి శకుంతలలా చూపించారు. వసుంధర డైమండ్ రూఫ్ వాళ్లకు సంబంధించిన నగలను ఈ సినిమాలో చూపించారు. సామ్ కు స్టైలిస్ట్ గా నీతా లల్లూ వ్యవహరించారు. అలాగే ఈ సినిమా కోసం ఉపయోగించిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. యువరాణిగా సామ్ మెరిసిపోయేలా కనిపించేందుకు నిజమైన నగలను వాడి అందరిలో చెరగని ముద్ర వేశారు. అంతే కాదండోయ్ సామ్ కట్టుకున్న చీరలో కూడా ఒరిజినల్ ముత్యాలను పొదిగారట. ఆ చీర మొత్తం బరువు 30 కిలోల వరకు ఉంటుందని సమాచారం. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.