Monday, November 18, 2024

మూడేళ్లలో ఆరున్నర లక్షల ఇళ్ల నిర్మాణం.. పీఎంఏవైపై వైసీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో 6,56,529 ఇళ్లను నిర్మించి ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పీఎంఏవై కింద రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నలకు గురువారం కేంద్ర  కేంద్రం గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కుశాల్‌ కిషోర్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

2019-20 నుంచి 2021-22 డిసెంబర్‌ 12 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు 20,74,770 ఇళ్లు మంజూరు కాగా, అందులో 6,56,529ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు. ఈ పథకం కింద గత మూడేళ్లలో ఏపీకి రూ.5,800కోట్లు విడుదల చేయగా, ఇప్పటి వరకు రూ.8,710 కోట్ల రూపాయలను ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేసినట్టు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement