నోయిడా: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ మరో ప్రిస్టేజియస్ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను టాటా గ్రూపు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ప్రకారం టాటా గ్రూపు టెర్మినల్, రన్‌వే, ఎయిర్‌సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైన పలు నిర్మాణాలను చేపట్టనుందని యమున ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ వంద శాతం సబ్సిడీతో యమున ఎయిర్‌పోర్టును నిర్మించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కంపెనీతో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అక్టోబర్ 7,2020న ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో, వైఐఏపీఎల్ సంస్థ టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్‌తో నోయిడా ఎయిర్‌పోర్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్‌స్ట్రక్షన్ పనులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్విస్ కంపెనీ ప్రకటించింది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సుమారు 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటుకానుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు 2024కు పూర్తవుతాయని ఆ సంస్థ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..