తెలంగాణలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించింది.
అయితే.. కోర్టు ఆదేశించిన నియామక ప్రక్రియ కొనసాగుతుందని పలువురు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెడికల్ టెస్టులు ఆపేయాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో బోర్డు మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించరాదని నియామక బోర్డు ఆదేశాలు జారీ చేసింది.