రైలులో చెలరేగిన మంటలను ఆర్పుతూ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వల్సాద్ ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆర్పీపీఎఫ్ బృందం మంటలను అదుపు చేయడం ప్రారంభించింది. అదే సమయంలో కానిస్టేబుల్ వినోద్ కుమార్ చిన్న ఫైర్ సిలిండర్ (అగ్నిమాపక యంత్రం)తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అగ్నిమాపక సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో వినోద్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే అధికారులు వినోద్‌కుమార్‌ను ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.
వల్సాద్ ఎక్స్‌ప్రెస్ ఇవాళ ఉదయం 6.30 గంటలకు ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుందని చెబుతున్నారు. కొద్దిసేపటికి రైలులోని ఎస్-8 బోగీలోని టాయిలెట్‌లో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే, ఆర్పీఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి. ఆర్పీఎఫ్ జవాన్ వినోద్ కుమార్ కూడా వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిలిండర్‌తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. ఒక అగ్నిమాపక సిలిండర్ అయిపోయినా మంటలు తగ్గలేదు. ఇంతలో మరో ఫైర్ సిలిండర్ తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. సిలిండర్ తాళం తెరవగానే సిలిండర్ పేలింది. ఇందులో వినోద్ కుమార్ మృతి చెందాడు. ఆర్పీఎఫ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.