Friday, November 22, 2024

సముద్రాలపై ఆధిపత్యానికి కుట్ర.. నాటో విస్తరణ అందులో భాగమే : పుతిన్‌

మాస్కో:ప్రపంచంలోని మహాసముద్రాలపై ఆధిపత్యం కోసం అమెరికా వ్యూహాత్మక కుట్రలు పన్నుతోందని, నాటో విస్తరణ అందులో భాగమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు. అందుకే నాటో విస్తరణను వ్యతిరేకిస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా ఐరోపా సమాఖ్యలోని దేశాలు ఆంక్షలు విధించాయి.

ఈ నేపథ్యంలో రష్యా విడుదల చేసిన 55 పేజీల అధ్యయన పత్రంపై పుతిన్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ వంటి దేశాలకు సభ్యత్వం ఇవ్వడం ద్వారా నాటో సైనిక మౌలిక సదుపాయాల కల్పనపై అమెరికా దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. రష్యాను దెబ్బతీయడమే వారి లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement