290 మంది ప్రాణాలు కోల్పోయిన ఒడిశా రైలు ప్రమాదంలో బాధితుల కోసం తాను ఇచ్చే రూ.10 కోట్ల విరాళాన్ని ఆమోదించాలని కోరుతూ ప్రస్తుతం మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్మన్ సుకేష్ చంద్రశేఖర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు శుక్రవారం ఒక లేఖ రాశాడు. ”పైన పేర్కొన్న మొత్తం నేను చట్టబద్దంగా సంపాదించినది. సదరు మొత్తాన్నికి పన్నులు కట్టాను. రూ.10 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటుగా ఫైల్ చేసిన పన్ను రిటర్న్ పత్రాలను జతపరుస్తాను” అని లేఖలో పేర్కొన్నాడు. తాను అందించే విరాళాన్ని ప్రమాదంలో మృతుల పిల్లల చదువులకు వినియోగించాని కోరాడు. ఒక బాధ్యత కలిగిన మంచి పౌరుడిగా తాను విరాళం అందిస్తున్నట్టు సుకేష్ చెప్పాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement